కార్ డోర్ల పైబడిన మరకల్ని, స్క్రాచెస్ ని...! 2 m ago
మనం ఇష్టపడి కొనుక్కున్న కారు పై అప్పుడప్పుడు గీతలు పడడం సహజమే కానీ అవి చూడటానికి బాగుండవు. వాటిని దూరం చేయటానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు. అలాగే కొన్ని ఇంటి చిట్కాలని ఫాలో అయితే మరకలు మరియు స్క్రాచెస్ని ఈజీగా ఇంట్లోనే పోగొట్టుకోవచ్చు. దీనికి కావాల్సివి బేకింగ్ సోడా, వెనిగర్, కొబ్బరి నూనె. బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి పేస్టులా చేసుకుని గీతలు పడిన చోట గుడ్డతో రుద్ది తర్వాత క్లీన్ చేస్తే కాస్తయినా మరకలు తగ్గుతాయి. అలాగే వెనిగర్, కొబ్బరినూనె సమాన పరిణామాలతో కలుపుకొని గీత ఉన్న ప్రదేశంలో రాసి టిష్యూతో రుద్ది, కార్ డోర్ల పైబడిన మరకలని, స్క్రాచెస్ని ఇలా ఈజీగా మాయం చేయండి.